BHNG: మోటకొండూరు మండలం వర్టూరులో 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు దళితవాడలో ‘పల్లెనిద్ర సహపంక్తి భోజనం’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గ్రామ దళితవాడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసి వారితో పాటు సహపంక్తి భోజనం చేసి, అక్కడే రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు.