SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 10 నుంచి 25 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా రాస్తా రోకోలు, ధర్నాలు, సమావేశాల పేరిట విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఒత్తిడి చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.