‘మిరాయ్’ తనకు కంబ్యాక్ చిత్రం అని మంచు మనోజ్ అన్నాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తన జీవితంలోకి శ్రీరాముడిలా వచ్చాడని మనోజ్ చెప్పాడు. ‘అతను కథ చెప్పిన వెంటనే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాసినందుకు తన కాళ్ల మీద పడిపోవాలనిపించింది. కానీ, కార్తీక్ తనకంటే చిన్నవాడు కావడంతో గట్టిగా కౌగిలించుకుని అభినందించా. ఈ చిత్రంలో తన పాత్ర ‘అవెంజర్స్’లోని ‘థానోస్’లాగా ఉంటుంది’ అని తెలిపాడు.