NRML: మనిషి దంతాలు పోలిన ఓ చేప లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ వలలో చిక్కింది. గోదావరి నదిలో చేపలు పడుతున్న క్రమంలో సంతోష్‌కు ఈ చేప దొరికింది. ఈ అరుదైన చేపను చూసి ప్రజలు వింతగా ఉందని ఆశ్చర్యపోయారు. చేప బరువు కేజీన్నర ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ అరుదైన చేప ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.