AKP: గొలుగొండ మండలం జోగుంపేట జంక్షన్ వద్ద నిన్న పైపు లైన్ పగిలిపోయి గంటల పాటు తాగునీరు వృధాగా పోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల స్పందించి ఈ పైపు లైన్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేశారు. ఈ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గెడ్డం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.