PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్లకు చెందిన వంశీ కిరణ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ సోమవారం రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు శ్యామ్ కోరారు. విజ్ఞానానికి విద్య తొలిమెట్టన్నారు.