KNR: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో PDSU ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు కాంసారపు రవితేజ, జిల్లా నాయకులు ఎండీ అస్లాం, బాబు పాల్గొన్నారు.