MHBD: జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో యూరియా పంపిణీ తీరును జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వయంగా పర్యవేక్షించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కలెక్టర్ పర్యవేక్షణలో రైతులకు కూపన్లు మంజూరు చేసి వరుస క్రమంలో యూరియా బస్తాలను అందజేశారు.