SRCL: ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని చందుర్తి విద్యాధికారి ఓరుగంటి వినయ్ కుమార్ అన్నారు. సోమవారం చందుర్తి మండల విద్యావనరుల కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే గురువు యొక్క మార్గదర్శనం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పాల్గొన్నారు.