BPT: చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలోని ఇందిరానగర్లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కౌసల్య అనే వివాహిత చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.