TG: హైదరాబాద్ చర్లపల్లిలో డ్రగ్స్‌ను ముంబయి పోలీసులు పట్టుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఏం చేస్తోందని విమర్శించారు. డ్రగ్స్ తయారీలో రేవంత్ రెడ్డికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ముంబై పోలీసులు వచ్చే దాకా.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేసిందని మండిపడ్డారు.