SRPT: జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరు అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు తెలిపారు. జిల్లాలో సోమవారం 640 మెట్రిక్ టన్నులలో 520 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇంకా 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు.