NLG: ఇటీవల విడుదల చేసిన ఎంపీటీసీ, ఎన్నికల ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించేందుకు సోమవారం కట్టంగూర్ ఎంపీడీవో ఆఫీస్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాశరావు మాట్లాడుతూ.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రాజకీయ పక్షాల నేతలను కోరారు.