KMM: ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.