SRPT: పోలీస్ కార్యాలయాల తనిఖీలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఈరోజు తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సర్కిల్ అధికారిని ఆదేశించారు. కార్యాలయం నందు రికార్డులను మంచిగా నిర్వహించాలని పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నమోదు పక్కాగా ఉండాలని సూచించారు.