ఆసియా కప్ రేపటి నుంచి UAE వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా.. గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. ఆ తర్వాత సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.