SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో వాటర్ మెన్‌గా పనిచేస్తూ నిద్రలోనే గుండె పోటుకు గురై మృతి చెందిన మార్పాక బాల ఎల్లం కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున గ్రామానికి చెందిన జామా మజీద్ కమిటీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.