VZM: సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు 19 కాల్స్ అందాయి. ప్రధానంగా రెండో విడత యూరియా సరఫరా పైనే కాల్స్ వచ్చాయని కలెక్టర్ అంబేద్కర్ స్వయంగా కాలర్స్తో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. యూరియా సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సమాధానం చెప్పారు. రెండో విడత సరఫరాకు ఇంకా సమయం ఉందని, వారం లోపలే యూరియను అందిస్తామన్నారు.