NZB: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిటి స్రవంతి రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. స్రవంతి రెడ్డి నగరపాలక సంస్థలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్‌గా, మాజీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు అధ్యక్షుడు రామచంద్రరావుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.