ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రేపు ‘అన్నదాత పోరు’ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వాల్మీకి సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందని, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని రంగయ్య పిలుపునిచ్చారు.