కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ప్రజల వద్ద నుంచి సోమవారం 6 అర్జీలు స్వీకరించారు. టిడ్కో సంబంధించింది 1,ఆక్రమణ 2, సీసీ రోడ్లు 2, ఇంటి పన్ను పేరు మార్పు 1 మొత్తం 6 అర్జీలను స్వీకరించారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.