NLG: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య ఆరోపించారు. చిన్నకాపర్తికి చెందిన ప్రజలు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమికి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.