ప్రకాశం: పెనమలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించారు. పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఈ సందర్భంగా సూచించారు.