నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను నిలువరించేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు.