TG: HYD నగరంలో రద్దైన పెద్ద నోట్లు భారీ మొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.2కోట్ల విలువ చేసే రద్దైన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.