AP: పల్నాడు జిల్లా తురకపాలెంలో అసాధారణంగా 30 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తురకపాలెంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లె నిద్ర చేయనున్నారు. వరుస మరణాలతో స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు, మూఢనమ్మకాలను తొలగించేందుకు ఎమ్మెల్యే పల్లె నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా స్థానికుల్లో ధైర్యం నింపనున్నారు.