VZM: నెల్లిమర్ల మండలంలోని తంగుడుబిల్లి గ్రామంలో ఉన్న చెరువు కబ్జా కాకుండా చూస్తానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. సోమవారం తంగుడుబిల్లి చెరువును ఆమె పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి చెరువు వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలన్నారు.