కృష్ణా: మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.