SRD: అందోల్ నియోజకవర్గం పరిధిలోనీ టేక్మాల్ మండలం ఎల్లుపెట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 22.50 లక్షల నిధులతో నిర్మించిన ప్రహరీ గోడను మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.