ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు.