CTR: బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ గురుపూజోత్సవానికి పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..గురువు మార్గదర్శకత్వమే విద్యార్థి భవిష్యత్తు అన్నారు.