NLR: దగదర్తి గ్రామ చెరువు పరిధిలో యదేచ్ఛగా గత కొంతకాలం నుంచి అక్రమంగా నల్లతుమ్మ చెట్లను రవాణా చేస్తున్నారు. చెరువు కట్టను ధ్వంసం చేసిన విషయంపై టీడీపీ నేత మాలేపాటి రవీంద్ర నాయుడు ఇవాళ పలువురు అధికారులను కలిశారు. కొంతమంది స్వలాభం కోసం చెరువులో ఉన్న నల్లతుమ్మ చెట్ల కట్టెలను అమ్ముకోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రాన్నిఅందజేశారు.