CTR: పుంగనూరు పట్టణం చింతల్ వీధిలో గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఆభరణాలు దోచకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి యజమాని హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.