SRD: జిల్లాలో ఈనెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించారు.