అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవుల, పందిళ్లపల్లె గ్రామాల్లోని 19, 25, 26 నంబర్ రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శనివారం, సోమవారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆథరైజేషన్ లేదని, చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నాయని చూపుతూ 6ఏ కేసులు నమోదుచేశారని డీలర్లు ఆరోపించారు. నాలుగేళ్లుగా ఆథరైజేషన్లు పెండింగ్లో ఉన్నా, అధికారపార్టీ ఒత్తిడితోనే దాడులు చేస్తున్నారని, అన్నారు.