నేపాల్లో తీవ్ర రాజీకయ సంక్షోభం నెలకొంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు. ప్రధాని కేపీ ఓలీ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇంటికి మూడు మిలిటరీ హెలికాప్టర్లు చేరుకున్నాయి.