AP: గుంటూరులో జరిగిన తురకపాలెం ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) బృందం పర్యటించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో NCDC బృందం మాట్లాడింది. వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలను అడిగి తెలుసుకుంది. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. బాధితులకు అందిస్తున్న వైద్య విధానాలు, చికిత్సపై చర్చించింది.