W.G: సీఎం సహాయనిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళవారం అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు రూ. 21,17,909 చెక్కులను ఎమ్మెల్యే అందించారు.