W.G: భీమవరం మండలం యనమదుర్రులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ-పంట నమోదు, అధిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు, పీఎం ప్రణామ్ తదితర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంరం స్థానిక రైతు పంట పొలం ఈ – పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.