PDPL: గోదావరిఖని వన్ టౌన్ సమీపంలో ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. సేక్రెడ్ హార్డ్ హైస్కూల్ దగ్గర ప్రధాన రహదారి గుంతలమయంగా మారి పూర్తిగా అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద గుంతలు ఏర్పడడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోయారు. వెంటనే మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.