VSP: రైతు ద్రోహి జగన్ అయితే రైతు బాంధవుడు చంద్రబాబు అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మంగళవారం గాజువాకలో మాట్లాడుతూ.. రైతులు పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండవ స్థానంలో ఉండేదన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసామన్నారు.