NTR: సోలార్ విద్యుత్ వినియోగం పెరగాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కోరారు. మంగళవారం విజయవాడ 28వ డివిజన్ భాను నగర్ 1వ లైన్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బొండా ఉమా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వివరించారు.