BDK: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. జయలక్ష్మి అధ్యక్షతన పాల్వంచలోని IDOC, DM&HO కార్యాలయంలో ప్రసూతి గర్భస్రావం (MTP) చట్టంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ గైనకాలజిస్టులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. అక్రమ గర్భస్రావాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.