ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి బాగల్ పూర్- యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (03403) ఈ నెల ఏడో తేదీ రాత్రి 10:30 గంటలకు బాగల్ పూర్ నుంచి బయలుదేరి 9వ తేదీ రాత్రి 11:50 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుందన్నారు.