అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సంకేతాలిచ్చారు. ‘మోదీ నా మిత్రుడు. మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను భారత్కు రావాలని ఆయన కోరుకుంటున్నారు. దాని గురించి మేం ఆలోచిస్తాం. నేను తప్పకుండా వెళ్తాను. ఆయన గొప్ప వ్యక్తి’ అని అన్నారు. వచ్చే ఏడాది పర్యటన ఉండొచ్చని పేర్కొన్నారు. 2020లో తన భారత పర్యటనను గుర్తుచేసుకుంటూ.. ట్రంప్ వ్యాఖ్యానించారు.