GNTR: మంగళగిరి SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ సంఘటన కారణంగా తదుపరి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, యూనివర్సిటీ యాజమాన్యం నేటి నుంచి ఈనెల 23 వరకు వర్సిటీకి సెలవులు ప్రకటించింది. ఈ సమయంలో యూనివర్సిటీ ప్రాంగణం అంతటా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.