RR: గచ్చిబౌలిలో 600 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.11 కోట్లు వరకు ఉంటుందని అధికారుల అంచనా వేశారు. అక్రమ విక్రయాల ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా, ఆక్రమణ తొలగించి ఫెన్సింగ్ వేసింది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. కొనుగోళ్లు జరిగిన తీరుపై పూర్తి స్థాయిలో విచారిస్తోంది.