కృష్ణా: యూరియా కొరత లేదని చెబుతూనే రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం లైన్లలో నిలబడాల్సి వస్తుందని కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.వి. లక్ష్మణస్వామి విమర్శించారు. మంగళవారం ఉంగుటూరు మండలంలోని సొసైటీలను పరిశీలిస్తూ యూరియా కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న రైతులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు.