TPT: రాజంపేట అటవీ పరిధిలో 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని 5 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆర్ఎ. సాయి కుమార్ తెలిపారు.జిల్లా అటవీ పరిధిలో SRపాలెం ఫారెస్ట్ బీట్లో కూంబింగ్ చేపట్టగా రాళ్లమడుగు తుమ్మల బయలు జంక్షన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తులు దుంగలు మోసుకొని వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినటట్లు ఆయన తెలిపారు.