KMR: మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాన్సువాడ పట్టణంలోని దాల్మల్ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. దాల్మల్ గుట్టకు చెందిన పంచ కల్లప్ప 35 మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు.